రెవిన్యూ శాఖలో భారీగా అవకతవకలు.. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్

రెవిన్యూ శాఖలో భారీ అవకతవకలు జరిగాయని చెప్పడానికి నిదర్శనమే రెవిన్యూ శాఖకు మంత్రి లేకపోవడం, కార్యదర్శి లేకపోవడం, సీసీఎల్ఎ లేకపోవడమే నిదర్శనమని కాంగ్రెస్ నాయకులూ బక్క జడ్సన్ పేర్కొన్నారు.

Update: 2023-07-26 16:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రెవిన్యూ శాఖలో భారీ అవకతవకలు జరిగాయని చెప్పడానికి నిదర్శనమే రెవిన్యూ శాఖకు మంత్రి లేకపోవడం, కార్యదర్శి లేకపోవడం, సీసీఎల్ఎ లేకపోవడమే నిదర్శనమని కాంగ్రెస్ నాయకులూ బక్క జడ్సన్ పేర్కొన్నారు.  అందుకే రెవిన్యూ శాఖ సీఎం కేసీఆర్ దగ్గర.. సీసీఎల్ఎగా రాష్ట్ర ప్రభుత్వ కోర్ట్ కాంటెంప్ట్ కేసులున్న నవీన్ మిట్టల్ వద్ద పెట్టారని అయన ఆరోపించారు. ధరణి సాఫ్ట్ వేర్ పోర్టల్ లో చోటు చేసుకున్న అక్రమాలు, తెలంగాణ ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జాయిష్ రంజాన్ పై జడ్సన్ బుధవారం లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ .. ధరణి పోర్టల్ సాఫ్ట్‌వేర్ కాంట్రాక్ట్ లో పెద్ద ఎత్తున్న ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఎల్ &ఎఫ్ఎస్ గ్రూప్ డిఫాల్ట్‌లు దాదాపు రూ.1 లక్ష కోట్ల రుణాలున్నాయని తెలిపారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దివాళా తీసినవిగా ప్రకటించబడ్డాయని పేర్కొన్నారు.

రెవిన్యూ శాఖ ఎవ్వరికి ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ సలహాదారు సోమేశ్ కుమార్ ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను, రైతులను, రెవిన్యూ సిబ్బందిని అతలాకుతలం చేస్తూ పరిపాలనను భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. కొన్ని లక్షల ఎకరాల భూసమస్యలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. సాదాబైనామా, పెండింగ్ దరఖాస్తులను నేటికీ పరిష్కరించలేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద భూసర్వే అని మొదలుపెట్టి అర్ధాంతరంగా రద్దు చేసుకోవడం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు అర్థమైందని తెలిపారు. సమగ్ర భూసర్వే నిర్వహించకుండా ధరణి పేరుతో భూప్రక్షాళన చేస్తున్నామని చెప్పుకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటె వెంటనే రెవిన్యూ మంత్రిని , రెవిన్యూ సెక్రటరీ, సీసీఎల్ఎను నియమించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..