అమిత్ షా వ్యాఖ్యలపై మావోయిస్టు పార్టీ సీరియస్

మతతత్వ రాజకీయాలతో బీజేపీ తెలంగాణలో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2023-04-27 06:42 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మతతత్వ రాజకీయాలతో బీజేపీ తెలంగాణలో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటమంటే 2001లో గుజరాత్‌లో జరిగిన మారణహోమాన్ని ఇక్కడకు తెచ్చుకోవటమే అని పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట గురువారం ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల చేవెళ్ల సభలో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని ప్రకటించడం కరెక్ట్ కాదని, ముస్లింలు ఈ దేశ పౌరులు కాదా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసిందన్నారు. ప్రతిపక్షం లేని నిరంకుశ పాలనను ఏర్పరుచుకుని దేశ సంపదను అదానీ లాంటి కార్పొరేట్లకు దోచి పెట్టాలన్నదే బీజేపీ విధానమని విమర్శించారు. తెలంగాణలోని దళితులు, మైనారిటీలు, మహిళలు, ప్రజాస్వామిక వాదులు కలిసి బీజేపీ అధికారంలోకి రాకుండా తరిమెయ్యాలని పిలుపు ఇచ్చారు.

Tags:    

Similar News