నల్లగొండ ఎంపీ రేసులో మన్మథరెడ్డి

నల్లగొండగా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ మన్మధరెడ్డి తెలిపారు.

Update: 2024-02-03 12:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండగా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ మన్మధరెడ్డి తెలిపారు. ఎన్నో ఏళ్లుగా బీజీపీలో కొనసాగుతూ పార్టీకి సేవ చేస్తున్నానని, తన కష్టాన్ని అధిష్ఠానం గుర్తించి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం సీటు కేటాయించాలని ఆయన కోరారు.  ఈ మేరకు మన్మథరెడ్డి హైదరాబాద్ బీజేపీ కేంద్ర ఆఫీసులో తనకు నల్లగొండ ఎంపీ టికెట్ కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఈటల రాజేందర్, ప్రకాశ్ రెడ్డి ప్రకాష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, నల్లగొండ జిల్లా బీజేపీ ఇన్‌చార్జ్ చింతల రామచంద్రారెడ్డి తదితరులను కలిశారు.

ఈ సందర్భంగా మన్మధ రెడ్డి మాట్లాడుతూ విద్యావేత్తగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తాను సేవ చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజాపోరు  చైర్మన్‌గా పని చేశానని గుర్తు చేశారు. ఆ సమయంలో అమరణ నిరహార దీక్ష కుడా చేసినట్లు అధిష్టానానికి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీలో వివిధ సేవలు అందించిన తనకు పార్టీ పెద్దల ఆశీసులు ఉన్నాయని, నల్లగొండ ఎంపీ టికెట్ తనకే వస్తుందని మన్మధ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read More..

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Tags:    

Similar News