Manchu: భార్య మాటలు విని చెడు మార్గంలో.. కొడుకుపై మోహన్ బాబు సంచలన ఆడియో

ఆస్తి తగాదాల విషయంలో మంచు ఫ్యామిలీ(Manchu Family)లో గత రెండు రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-10 15:21 GMT
Manchu: భార్య మాటలు విని చెడు మార్గంలో.. కొడుకుపై మోహన్ బాబు సంచలన ఆడియో
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఆస్తి తగాదాల విషయంలో మంచు ఫ్యామిలీ(Manchu Family)లో గత రెండు రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ నటుడు మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) కొడుకు పై విడుదల చేసిన ఆడియో సంచలనం రేపుతోంది. ఈ ఆడియోలో మోహన్ బాబు తన చిన్న కొడుకు మనోజ్(Manchu Manoj) ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఆడియోలో మోహన్ బాబు.. "మనోజ్‌.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను.. నీ చదువు కోసం చాలా ఖర్చు పెట్టానని భావోద్వేగబరిత వ్యాఖ్యలు చేశారు. భార్య మాటలు విని నువ్వు నా గుండెలపై తన్నావని, తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావని అన్నారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డామని, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయని, మనోజ్‌ నన్ను కొట్ట లేదు అని స్పష్టం చేశారు

అంతేగాక నా ఇంట్లోకి అడుగుపెట్టే అధికారం నీకు లేదు.. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు.. రోడ్డుకెక్కి నా పరువు తీశావు.. నా ఆస్తులు ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నా ఇష్టం.. పిల్లలకు ఇస్తానా.. దానధర్మాలు చేస్తానా అన్నది నా ఇష్టం" అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. కాగా ఆస్తి గొడవల కారణంగా మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లాడు. సెక్యూరిటీ సిబ్బంది లోపలికి రానివ్వకపోవడంతో గేట్లు తోసుకొని మీడియాతో సహా లోపలికి వెళ్లాడు. దీంతో బయటకి వచ్చిన మోహన్ బాబు మీడియా వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గోడవల గురించి వివరణ అడిగిన ఓ మీడియా జర్నలిస్ట్ పై దాడి చేశాడు.

Read More...

Telangana Journalists: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి


Tags:    

Similar News