గాంధీ భవన్‌‌కు రండి.. జానారెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్

పార్టీని మరింత పటిష్ఠపరిచేందుకు పీసీసీ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రతిష్ఠను కాపాడుకునేందకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీనియర్లకు కబురు పంపింది.

Update: 2025-02-02 03:29 GMT
గాంధీ భవన్‌‌కు రండి.. జానారెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీని మరింత పటిష్ఠపరిచేందుకు పీసీసీ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రతిష్ఠను కాపాడుకునేందకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీనియర్లకు కబురు పంపింది. గాంధీ భవన్‌కు వచ్చి.. ప్రతిపక్షాల నోటికి తాళం వేయాలని సూచించింది. పీసీసీ సారథి మహేశ్​కుమార్‌గౌడ్ తాజాగా..​కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన జానారెడ్డికి ఫోన్‌చేయడం సంచలనం రేపింది. అప్పుడప్పుడు గాంధీ‌భవన్‌కు రావాలని కోరారు. ఇంకొందర్ని కూడా గాంధీభవన్‌కు ఆహ్వానిస్తున్నారు. గాంధీ‌భవన్‌కు వారానికొకసారైన వచ్చేలా ప్లాన్ చేయాలని కాంగ్రెస్ వర్గాలను ఆయన కోరుతున్నారు. ఎన్నికలకు ముందు గాంధీభవన్ చుట్టూ చాలామంది నేతలు చక్కెర్లు కొట్టేవారు. కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునేందులు ఎత్తుకు పైఎత్తులు వేసేవారు. ఎన్నికలయ్యాక వారిలో చాలామంది గాంధీభవన్‌ను చూడడం మానేశారు. దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకొంటున్న ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్.. రోజుకొక ఇష్యూ రోడ్డెక్కుతుంది.

బీఆర్ఎస్ విష ప్రచారం

తెలంగాణలో రేవంత్ నేతృత్వంలో సజావుగా సాగుతున్న ప్రజాపాలనపై బీఆర్ఎస్ దండయాత్ర చేస్తోంది. కాంగ్రెస్‌పై బురద జల్లేందుకు.. బీఆర్ఎస్ సోషల్​మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్‌ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సీనియర్లు ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ అంతర్మథనం చెందుతుంది. ఎంపీలు చామల కిరణ్​కుమార్‌రెడ్డి, మల్లు రవి, కాంగ్రెస్​వర్కింగ్​ప్రెసిడెంట్​తూర్పు జగ్గారెడ్డి, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్​సామ రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​మినహా మిగతా వారు గాంధీభవన్ ముఖం చూడడం మానేశారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.

అందువల్లే బీఆర్ఎస్, బీజేపీల విమర్శలపై కౌంటర్​ఎటాక్‌లు తగ్గుముఖం పట్టాయని పీసీసీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌లో చరిష్మా ఉన్న నేతలు సైతం గాంధీ‌భవన్​మెట్లు ఎక్కకుపోవడంతో ఆ రెండు పార్టీలు పేట్రేగుతున్నాయని భావించి.. సీనియర్లకు పీసీసీ ఫోన్లు చేస్తోంది. ఢిల్లీ స్థాయి నేతలు వచ్చినప్పుడు మినహా..మిగతా సమయాల్లో పెద్ద లీడర్లు గాంధీభవన్ వైపు రావడం లేదని పీసీసీ చీఫ్​మహేశ్‌కుమార్‌గౌడ్ గుర్తించి...సీనియర్లను అప్రమత్తం చేశారు. అందులో భాగంగానే జానారెడ్డికి తాజాగా ఫోన్ చేశారు. గాంధీభవన్ ద్వారా కాంగ్రెస్ పాలన గొప్పతనాన్ని మీడియాకు వివరిస్తే...ప్రతపక్షాల నోటికి తాళం పడడం ఖాయమని పీసీసీ భావిస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు గాంధీభవన్ బాట‌ పడితే..బీజేపీ, బీఆర్‌ఎస్ ఇమేజ్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News