బీఆర్ఎస్‌‌లో చేరిన మహారాష్ట్ర నేతలు

మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన నేతలు బుధవారం ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్‌లో చేరారు.

Update: 2023-04-05 17:02 GMT
బీఆర్ఎస్‌‌లో చేరిన మహారాష్ట్ర నేతలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన నేతలు బుధవారం ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్‌లో చేరారు. మహారాష్ట్ర బీడ్ జిల్లా‌కు చెందిన దిలీప్ గోరె, మహారాష్ట్ర చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాజ్ జనార్థన్ రావు భంగర్‌కు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీడ్ మున్సిపల్ మేయర్ గా దిలీప్ గోరే గతంలో పనిచేశారు. ప్రస్తుతం శివసేన పార్టీ బీడ్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ తదితరులున్నారు.

Tags:    

Similar News