కార్మికుల పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి

గ్రామపంచాయతీలో పని చేస్తున్న కార్మికులకు గత కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు

Update: 2025-03-13 09:36 GMT

దిశ, వీపనగండ్ల: గ్రామపంచాయతీలో పని చేస్తున్న కార్మికులకు గత కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించి ఆదుకోవాలంటూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు డిప్యూటీ తాసిల్దార్, ఎంపీడీవో లకు వినతి పత్రాలు అందజేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించకపోతే ఈనెల 18న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపడతామని మండల పంచాయతీ కార్మికుల అధ్యక్షుడు వెంకటయ్య హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న రెండు నుంచి ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించి ఇకనుంచి రెగ్యులర్ వేతనాలు ఇవ్వాలని, జీవో నెంబర్ 60 ప్రకారం కార్మికులకు వేతనాలు అందించాలన్నారు.

కార్మికుల వేతనం కోసం ప్రత్యేక గ్రాంట్ ను ఏర్పాటు చేయాలని, పెరుగుతున్న జనాభా కనుగుణంగా గ్రామపంచాయతీలో కార్మికులను పెంచాలన్నారు. కౌరవుబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి, వారిని పంచాయతీ అసిస్టెంట్ గా నామకరణం చేయాలని అన్నారు. ప్రతి ఒక్క వర్కర్ కు 5 లక్షలు ఇన్సూరెన్స్, ప్రమాద బీమా 10 లక్షలు, దహన సంస్కారాలకు 30000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తదితర డిమాండ్లతో కూడిన అవినీతి పత్రాన్ని ఎంపీడీవో శ్రీనివాసరావుకు, డిప్యూటీ తాసిల్దార్ కృష్ణ మూర్తి లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు గోవిందు, శివుడు, రాజబాబు చారి, లక్ష్మయ్య, గంగమ్మ, తదితరులు ఉన్నారు.


Similar News