ప్రమాదపు మొక్కని తెలిసిన తొలగింపేది....?
మొక్కలు పర్యావరణానికి, మానవాళికి మేలు చేస్తాయి. అయితే, అన్ని రకాల మొక్కలు అలా చేయవు. కొన్ని రకాల మొక్కలు మనకు చేటు చేసే దాంట్లో కోనో కార్పస్ మొక్క ఒకటి.

దిశ, కల్వకుర్తి : మొక్కలు పర్యావరణానికి, మానవాళికి మేలు చేస్తాయి. అయితే, అన్ని రకాల మొక్కలు అలా చేయవు. కొన్ని రకాల మొక్కలు మనకు చేటు చేసే దాంట్లో కోనో కార్పస్ మొక్క ఒకటి. ఈ మొక్క ఆక్సిజన్‌ను తీసుకుని కార్బన్‌డైయాక్సైడ్ విడుదల చేస్తుంది. ఈ మొక్క ప్రాణాంతకమని తెలిసి వీటిపై పక్షులు కూడా వాలవు. సృష్టిలో గబ్బిలం వాలని చెట్టు ఏదైనా ఉందంటే అది కోనో కార్పస్ చెట్టే. వీటిపై పూర్తి అవగాహన లేని కల్వకుర్తి మున్సిపల్ అధికారులు, గత ప్రజా ప్రతినిధులు హరిత హారంలో భాగంగా 167 జడ్చర్ల - కోదాడ జాతీయ రహదారికి ఇరువైపుల, బస్టాండ్ వెళ్ళే దారిలోని డివైడర్ల మధ్యలో విరివిగా నాటారు. దీనికి వేగంగా పెరిగి, పచ్చగా అందంగా శంకు ఆకారంలో కనిపిస్తుంది. ఈ మొక్క ప్రమాదమని తెలిసిన పట్టణంలో వందల సంఖ్యలో నాటారు. పట్టణంలోని పాఠశాలల్లో, హాస్టల్ లో చాల వరకు ఈ కోనో కార్పస్ మొక్కలే దర్శనమిస్తున్నాయి.
కోనో కార్పస్ మొక్కపై గతంలో పలు మార్లు " దిశ " పత్రికలో ప్రచురితమైతే ఆ సమయంలో ఏపుగా పెరిగిన కొమ్మలు తొలగిస్తున్నారే తప్ప.. ఈ మొక్క ద్వారా ప్రమాదం పొంచి వున్నా సంగతి మున్సిపల్ శాఖ అధికారులు మరిచారు. రెండేళ్ళు ప్రపంచాన్నే గడగడ లాడించిన కరోనా మహమ్మారి సోకిన వ్యక్తికి శ్వాసకోశ సమస్యలతో ఎలా ఇబ్బంది పడతాడో ఈ కోన కార్పస్ చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చేవారు కూడా అంతటి ప్రమాదానికి గురయ్యే అవకాశముందని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చెట్లు పూల నుంచి అధికంగా పుప్పొడి వస్తుంది. 80 మీటర్ల లోతు వరకు వీటి వేర్లు వ్యాపించి భూగర్భ జలాలను పీల్చేస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు మారుతున్నారే తప్పా.. సమస్యను పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. జీవకోటికి ప్రాణహాని తలపెట్టే కోనోకార్పస్ మొక్కలను, వేర్ల నుంచి తొలగించి ప్రజలను కాపాడాలని నిపుణులు, వైద్యులు కోరుతున్నారు.
ఇది గాలిలో కలవడం, మనుషులు పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు రాడవం జరుగుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటోందని వైద్యులు పేర్కొంటున్నారు. మన రాష్ట్రంలో దాదాపు 11 కోట్లకు పైగా ఉన్నాయని అంచనా. కోన కార్పస్ విషవాయువు అని తెలిసి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో వేల సంఖ్యలలో మొక్కలను తొలగించారు. ప్రస్తుత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మొక్కలు ఎక్కడ ఉన్నా సమూలంగా నిర్మూలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. గత ప్రభుత్వంలోనే కోనో కార్పస్ మొక్కలు ఎక్కడ ఉన్న తొలగించాలని రాష్ట్ర కమిషనర్ సర్కులర్ ని విడుదల చేశారు. ఐనా వాటిని తొలగించకుండా మున్సిపల్ సిబ్బంది నీళ్ళు పోసి మరి ఏపుగా పెంచుతున్నారు. 2018 లో కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఓ నిజాయితీ సర్కిల్ అధికారి ఈ మొక్కను తొలగించాలని నేటికి పోరాటం చేస్తున్నాడు.
తన బాధ్యత లా అండ్ ఆర్డరే కాదు ప్రజా ఆరోగ్యం కూడా అవసరమని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాడు. 15 రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోనో కార్పస్ మొక్కలు ప్రమాదమని, మానవాళికి ముప్పు ఉన్నందున వెంటనే తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నందున ఈ కోన కార్పస్ చెట్లను ఫారెస్ట్, మున్సిపల్ అధికారులు యుద్ద ప్రాతిపదికన వెంటనే తొలగింపు ప్రక్రియను చేపట్టి, ఆరోగ్య కరమైనా మొక్కలు నాటలని ప్రజలు ప్రాణాలను కాపాడాలని మేధావులు, పట్టణ ప్రజలు, విద్యావేత్తలు కోరుతున్నారు.
శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి - గని కృష్ణ కుమార్, వైద్యులు , కల్వకుర్తి
కోనోకార్పస్ వృక్షాల పుప్పడి అత్యంత ప్రమాదకరమైనది. వీటిని వాసన పీల్చి నప్పుడు శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో కొన్ని రసాయనాలు విడుదలై శ్లేష్మం పెరిగి కఫం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. చిన్నారులకు, కరోనా సోకిన వ్యక్తి శ్వాసకోశ సమస్యలతో ఎలా ఇబ్బందులు పడతారో ఈ చెట్ల నుంచి పీల్చే గాలి వల్ల అంతటి ప్రమాదానికి గురయ్యే అవకాశముంది.