Wanaparthy Collector : ఆక్సిజన్ ప్లాంట్ పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి

వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన మరమ్మత్తు

Update: 2024-08-13 13:57 GMT

దిశ,వనపర్తి : వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేయాలని,రోగులకు ఆక్సిజన్ ప్లాంట్ ను వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య అధికారులను ఆదేశించారు. మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రి భవనం, ఆవరణంలోని మార్చ్యూరీ, కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్, స్టాఫ్ రూమ్, పాథాలజీ గదులను పరిశీలించారు.మరమ్మత్తు పనులను త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా శ్రీ భారత్ ఫార్మా ద్వారా ఏర్పాటు చేస్తున్న నూతన ఆక్సిజన్ ప్లాంట్ పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

పనులు నాణ్యతతో చేయాలని, మౌళిక సదుపాయాల కల్పనకు నిధులు కావాలంటే ఇస్తానని,వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు.మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సైతం అప్పుడే పుట్టిన బిడ్డల వార్డుకు ఆక్సిజన్ సౌకర్యం అందించే విధంగా మరో ఆక్సిజన్ ప్లాంట్ అక్కడ నెలకొల్పాలని శ్రీ భారత్ ఫార్మా సిబ్బందిని సూచించారు.ఆసుపత్రి సూపరిండెంట్ రంగా రావు, టి ఎస్ యం. ఐడిసీడీఈ లు శివ, సాదిక్, ఆర్. యం.వో కలెక్టర్ వెంట ఉన్నారు.


Similar News