యువకుడిని కాపాడిన ఇద్దరు ఎస్సైలు..

కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన ఓ యువ‌కుడి ప్రాణాల‌ను ఇద్దరు ఎస్సైలు కాపాడారు.

Update: 2023-05-12 17:11 GMT
యువకుడిని కాపాడిన ఇద్దరు ఎస్సైలు..
  • whatsapp icon

దిశ, రాజోలి : కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన ఓ యువ‌కుడి ప్రాణాల‌ను ఇద్దరు ఎస్సైలు కాపాడారు. వివ‌రాల్లోకి వెళ్తే రాజోలి మండలంలోని ముండ్లదిన్నె గ్రామానికి చెందిన అంజి అలియాస్ బాలు (25)అనే యువకుడు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్న అని వీడియో కాల్లో తన మిత్రుడికి సమాచారం ఇవ్వడంతో మిత్రుడు హుటాహుటిన మానవపాడు ఎస్సై సంతోష్ కు సమాచారం ఇవ్వడంతో మనవపాడు ఎస్సై, రాజోలి ఎస్సై కురుమయ్యకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫోన్ నెంబర్ సహాయంతో లొకేషన్ గుర్తించి ఆ యువకుడిని వెంటనే వడ్డేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్లు మాట్లాడుతూ చాకచక్యంగా వ్యవహరించి సరైన సమయానికి ఆసుపత్రికి తేవడం ద్వారానే బాధితుడు బ్రతికాడని, ఆలస్యం అయితే ప్రాణం కాపాడి ఉండేవాళ్లం కాదన్నారు. సమయానికి ఆస్పత్రికి తీసుకొచ్చిన పోలీసులను అభినందించారు. యువకుడిని ఆత్మహత్యాయత్నం నుండి కాపాడిన ఎస్సైలకు పలువురు అభినందించారు.

Tags:    

Similar News