భారత దేశ చరిత్రలోనే గుర్తుండిపోయే రోజు ఇది: Minister Niranjan Reddy
సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
దిశ, వనపర్తి: సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. వనపర్తి జిల్లా కేంద్రంలో మొదటి మహిళ వ్యవసాయ గురుకుల డిగ్రీ కళాశాల ప్రారంభించుకోవడం చరిత్ర పుటలలో సువర్ణ అక్షరాలతో లిఖించుకునే సందర్భమని మంత్రి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం, మెడికల్ కళాశాల వసతిగృహ నిర్మాణానికి భూమిపూజ, నూతన ఐటీఐ కళాశాల భవనం, మహిళా బీసీ గురుకుల డిగ్రీ కళాశాల (వ్యవసాయ) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల సీఎం కేసీఆర్ 16 నూతన గురుకులాలకు మంజూరు చేశారని, అందులో రెండింటిని కరీంనగర్, వనపర్తిలో గురుకుల కళాశాలలో వ్యవసాయ డిగ్రీ కళాశాలలుగా ప్రారంభింస్తున్నామన్నారు. దేశంలో 1030 గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు ఉండే నూతన కోర్సులను ప్రభుత్వ విద్య విధానంలో ప్రవేశపెడుతున్నామని తెలిపారు. వనపర్తికి వివిధ విద్యా సంస్థల ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్‌లకు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
దేశానికి మార్గదర్శకం కావాలి: మంత్రి గంగుల కమలాకర్
తొలి మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల ప్రారంభించుకోవడం తెలంగాణ సీఎం కేసీఆర్ దార్శనీయతకు ఒక మచ్చు తునక అని గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు 60 శాతం ఉన్న బీసీలను కుల వృత్తులకు పరిమితం చేసి, చదువుకు దూరం చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం 310 గురుకులాల ఏర్పాటు చేసి.. 1,65,680 మంది విద్యార్థులకు ఉచిత విద్య నందిస్తున్నామన్నారు. దేశంలోనే తొలి మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల ప్రారంభించుకోవడం గర్వంగా ఉందన్నారు.
కళ్ళముందు అభివృద్ధి కనిపిస్తుంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వనపర్తి జిల్లాలో కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీసీ మహిళా డిగ్రీ కళాశాలలో వ్యవసాయ కోర్సు ప్రవేశపెట్టడం అభినందనీయన్నారు. వనపర్తి జిల్లా ప్రజలు భవిష్యత్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డిని గుర్తుపెట్టుపెట్టుకునే విధంగా అభివృద్ధి పనులు, ఉన్నత విద్యాసంస్థలు అందుబాటులోకీ రావడం సంతోషకరమన్నారు.
వనపర్తి కాదు వనరుల పర్తిగా రూపుదిద్దుకుంది: ఎంపీ పోతుగంటి రాములు
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హయాంలో వనపర్తి వనరుల పర్తిగా మారిందన్నారు ఎంపీ పోతుగంటి అన్నారు. వనపర్తి అభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వనపర్తి, నాగర్ కర్నూలు, గద్వాలలకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరుకి కృషి చేస్తానన్నారు.
దేశంలో బీఆర్ఎస్ గెలవాలి - కేసీఆర్ ప్రధాని కావాలి: కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
బీజేపీ ప్రభుత్వం మాటలను నమ్మవద్దని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి.. సీఎం కేసీఆర్‌ను ప్రధానిని చేయాలని అన్నారు.వనపర్తి జిల్లా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయానన్నారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి నిరంతరం నియోజకవర్గం అభివృద్ధి కోసం తాపత్రయం పడుతుంటారన్నారు.
తెలంగాణలోని 33 జిల్లాలలో వనపర్తిలోనే అభివృద్ధి ముందుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు, రిజిష్ట్రార్ సుధీర్ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్, మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
READ MORE