Srisailam project : ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1331 మెగా యూనిట్స్..

బహుళార్ధక సాధక ప్రాజెక్టులో ఒకటైన శ్రీశైలం ప్రాజెక్టు 2021 లో జరిగిన ప్రమాదంలో తెలంగాణ ఎడమ గట్టు సొరంగ శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టుల్లో నాలుగో మోటార్ పూర్తిగా కాలిపోవడం వలన కోట్లాది రూపాయల ఆస్తి నష్టంతో పాటు తొమ్మిది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సంఘటన నేటికి కళ్ళముందే కనిపిస్తున్నది.

Update: 2024-08-04 13:50 GMT

దిశ, అచ్చంపేట : బహుళార్ధక సాధక ప్రాజెక్టులో ఒకటైన శ్రీశైలం ప్రాజెక్టు 2021 లో జరిగిన ప్రమాదంలో తెలంగాణ ఎడమ గట్టు సొరంగ శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టుల్లో నాలుగో మోటార్ పూర్తిగా కాలిపోవడం వలన కోట్లాది రూపాయల ఆస్తి నష్టంతో పాటు తొమ్మిది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సంఘటన నేటికి కళ్ళముందే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో గత రెండు, మూడు ఏళ్ల నుంచి రాష్ట్రంతో పాటు పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా సరిపడా వర్షాలు కురవకపోవడం వల్ల ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి కృష్ణా జిల్లాలో ఆశించిన మేర రాలేదు.

కావున గత ఏడాది కూడా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆశించిన మేర కాలేదు. ఈ తరుణంలో ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడం వలన ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాం, జూరాల, సుంకేసుల ఇతర ప్రాజెక్టుల నుండి గత నెల 22 నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు లక్షలాది క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. నిరంతరాయంగా 12 రోజులు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

జూలై 25న ఉపముఖ్యమంత్రి రివ్యూ..

గత నెల జూలై 25న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 12 మంది ఎమ్మెల్యేల బృందం శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ అధికారులతో రివ్యూసమావేశం నిర్వహించారు. నాలుగో యూనిట్ మరమ్మత్తుల విషయం పై చర్చించి త్వరితగతిన పనులు చేపట్టాలని, నిధుల విషయంలో ఎలాంటి కొరత లేదని ఆదేశించిన సంగతి తెలిసిందే. తదుపరి అందుకు సంబంధించిన అధికారులు చర్యలు మొదలు పెట్టినారు.

ఏడాది విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఎంత..

గత ఏడాది విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువ జరిగిందని ఈ ఏడాది విస్తారంగా వరద జలాలు వచ్చి ప్రాజెక్టులు చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న 1331 మెగా యూనిట్స్ లా ఉత్పత్తి లక్ష్యం తప్పక నెరవేరుతుందని నిరంతరాయంగా నాలుగు నెలలు విద్యుత్ ఉత్పత్తి చేసేలా తగిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో ఆరు విద్యుత్ మోటర్లు ఉండగా ఐదు మోటర్లు గత జులై 22 నుండి ఆగస్టు నాలుగు ఆదివారం వరకు రోజుకు 18 .74 మెగా యూనిట్లతో మొత్తం 178.121 మెగా యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతుంది. ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 49 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఇంత తక్కువ ఖర్చుతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మరెక్కడా లేదు. అలాగే అప్పర్ జూరాల విద్యుత్ కేంద్రాల ద్వారా 330 మెగా యూనిట్లు లోయర్ జూరాల విద్యుత్ కేంద్రం ద్వారా 294 మెగా యూనిట్లు ఈ ఏడాది లక్ష్యంగా చేయాల్సి ఉంటుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా ఆదాయం ఎంత..

రాష్ట్రంలో ఉన్న పోచంపాడు, పులిచింతల, నాగార్జునసాగర్, నిజాంసాగర్, సింగూరు, పెద్దపల్లి, పీలేరు, పుట్టంగండి ప్రాజెక్టుల వద్ద ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 1000 కోట్ల ఆదాయం వస్తే కేవలం ఒక్క తెలంగాణ శ్రీశైలం ఎడమ గట్టు సురంగ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. కావున 2021 లో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఎలాంటి సాంకేతిక లోపాలు ఉత్పన్నమైన వాటిని అధిగమించేందుకు అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది.

నాలుగు రోజుల క్రితం..

శ్రీశైలం నడవగట్టు సురంగ విద్యుత్ కేంద్రంలో 2021 లో జరిగిన పరిణామంలో ఈ విద్యుత్ కేంద్రంలో 6 విద్యుత్ మోటార్లు ఉండగా నాలుగో విద్యుత్ మోటార్ పూర్తిగా ధ్వంసం అయిన విషయం తెలిసిందే. అయితే దానిని మరమ్మత్తు చేసేందుకు వాయిత్ కంపెనీ యూరోపియన్ దేశానికి చెందిన సాంకేతిక నిపుణులు మరమ్మత్తుల కోసం టెండర్ తగ్గించుకోగా అని వారి కారణాల చేత మరమ్మత్తులు చేయలేక పోయింది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా ప్రజా ప్రతినిధులు శ్రీశైలం జెన్కో విద్యుత్ కేంద్రంలో రివ్యూ సమావేశం నిర్వహించి మరమ్మత్తులు నోచుకోని విద్యుత్ మోటార్ను తక్షణమే మరమ్మత్తు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సూచనలు చేస్తూ టెండర్ దక్కించుకున్న కంపెనీ స్పందించకపోతే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. అందుకు జెన్కో అధికారులు చర్యలు మొదలుపెట్టడంతో టెండర్ దక్కించుకున్న వాయిస్ కంపెనీ సాంకేతిక నిపుణుల యాజమాన్యం సరిగ్గా నాలుగు రోజుల క్రితం విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి త్వరలోనే మరమ్మత్తుల పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

సరిపడా నిధులు ఉన్నాయి.. సిఈ సూర్యనారాయణ..

శ్రీశైలం తెలంగాణ ఎడమ గట్టు సొరంగ విద్యుత్ కేంద్రంలో మరమ్మత్తు చేయాల్సిన నాలుగో యూనిట్ కు సరిపడా నిధులు ఉన్నాయన్నారు. సుమారు రెండు కోట్ల ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు ఉందని తెలిపారు. నిధులకు కొరత లేదని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రివ్యూ చేసి ఆదేశించిన విషయాన్ని ఉత్పత్తి కేంద్రం చీఫ్ ఇంజనీర్ సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దిశతో మాట్లాడుతూ.. 4వ యూనిట్ మరమ్మత్తులకు సంబంధించిన అండర్ దారుడైన యూరప్ దేశానికి చెందిన వాయిత్ కంపెనీ యాజమాన్యం గత నాలుగు రోజుల క్రితం ప్రాజెక్టును సందర్శించి వెళ్లారని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం చీఫ్ ఇంజనీర్ సూర్యనారాయణ తెలిపారు.

రానున్న నాలుగు నెలల్లో అందుకు సంబంధించిన పూర్తి మిషనరీ రానున్నది వచ్చే ఏడాది నాటికి నాలుగో యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. గత ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సాంకేతిక లోపాలు ఏర్పడిన అటు ఆక్సిజన్ పరంగా రక్షణ పరంగా అలాగే సంఘంలో విద్యుత్ అంతరాయం ఏర్పడితే బయటి నుంచి క్షణాల్లో విద్యుత్ ఉత్పత్తి సరఫరా చేసేలా అన్ని జాగ్రత్తలు, అందుకు సంబంధించిన చర్యలు తీసుకున్నామని, గత 13 రోజుల నుండి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అన్నారు. ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఒక వెయ్యి 1331 మెగా యూనిట్స్ లక్ష్యాన్ని తప్పక చేరుకుంటామన్నారు.

Tags:    

Similar News