నడిరోడ్డుపై కారు పార్కింగ్ చేసిన అధికారి.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై అడ్డంగా ఓ అధికారి కారు పార్కింగ్ చేయడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Update: 2023-06-01 16:20 GMT
నడిరోడ్డుపై  కారు పార్కింగ్  చేసిన అధికారి.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం..
  • whatsapp icon

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై అడ్డంగా ఓ అధికారి కారు పార్కింగ్ చేయడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనునిత్యం హెల్మెట్ లేకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వాహనాలపై వెంటనే ఫోటోలు దింపి చలాన్లు వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు సైతం సంబంధిత వాహనాన్ని పక్కకు తీయకపోవడంతో సుమారు గంట పాటు ప్రధాన రహదారిపై ఆయా ప్రాంతాల నుంచి వెళ్తున్న వాహనదారులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కారు ముందు భాగంలో కల్వకుర్తి డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ అంటూ రాసి ఉండడంతో ప్రయాణికులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్న బాధ్యత గల ప్రభుత్వ అధికారి తన బాధ్యతను మరిచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రధాన రహదారిపైనే తన వాహనాన్ని నిలిపి ఉంచడంతో అధికారిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారి వాహనానికి చలానా విధించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News