అంగరంగా వైభవంగా రంగనాథుడి రథోత్సవం

శ్రీరంగాపూర్మండల కేంద్రంలో శ్రీదేవి భూదేవి సమేత ఐదు తలల శేషనాగుపై సేదతీరుతు వెలసిన రంగానాథ స్వామి రథోత్సవం గురువారం కన్నుల పండుగగా జరింగిది.

Update: 2025-03-13 15:19 GMT

దిశ ,శ్రీరంగాపూర్: శ్రీరంగాపూర్మండల కేంద్రంలో శ్రీదేవి భూదేవి సమేత ఐదు తలల శేషనాగుపై సేదతీరుతు వెలసిన రంగానాథ స్వామి రథోత్సవం గురువారం కన్నుల పండుగగా జరింగిది. ఈ నెల 6న స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా..11న అర్చకులు గోదారంగనాథుడి కళ్యాణోత్సవం నిర్వహించారు. గురువారం ఉదయం ఆలయంలోని గర్భగుడిలోని మూలవిరాట్ తో పాటు ఉత్సవ విగ్రహాలకు ఆలయ ధర్మకర్త రాజా కృష్ణదేవరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఉత్సవ మూర్తులను సేవకులు పల్లకి సేవలో స్వామివారి రథంలో కొలువుతీర్చారు. తదనంతరం భక్తులతో కలిసి రథాన్ని ముందుకు కదిలించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రథోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరైయ్యారు. శ్రీరంగాపూర్ అన్ని దారులు వాహనాలతో భక్తులతో కిటకిటలాడగా.. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. ఈ నెల 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా ఉగాది పండుగ వరకు జాతర కొనసాగనుంది.


Similar News