తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: మంత్రి జూపల్లి

తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Update: 2024-12-14 10:40 GMT

దిశ, కొల్లాపూర్: తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో రూ,8 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వివిధ అభివృద్ధి పనులకు శంకు స్థాపన, అనంతరం పట్టణ శివారులోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాల విద్యార్థినులతో కలిసి శనివారం మంత్రి జూపల్లి సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ అభివృద్ధి పథంలో కొల్లాపూర్ మున్సిపాలిటిని ముందు వరసలో నిలపాలనే లక్ష్యంతో ఒకే రోజు కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 20వార్డుల్లో అభివృద్ధి పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ముంచిందని ఆయన ఆరోపించారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా బీఆర్ ఎస్ పాలనలో కొనసాగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు గౌరవ మంత్రి శ్రీ జూపల్లి ఆరోపించారు.ప్రజల మనోభావాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.అనంతరం పట్టణ శివారులోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/ జూనియర్ కళాశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు,హాస్టళ్ల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచిన నేపథ్యంలో పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలను మంత్రి జూపల్లి సందర్శించారు.విద్యార్థినులతో ప్రత్యేక సమావేశమైన మంత్రి జూపల్లి విద్యార్థినిలకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలను రాబట్టి విద్యార్థినిల ప్రతిభను గుర్తించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ చదువే సమాజాభివృద్ధికి మూలమని స్పష్టం చేశారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగి,కన్న తల్లిదండ్రులు,పుట్టిన ఊరికి చదివిన పాఠశాలకు, గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు.గురుకుల పాఠశాల/కళాశాలలో అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదులను పూర్తి చేయాలనీ,అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థినిలు మంత్రి కి ఏకరువు పెట్టారు.అందుకు మంత్రి జూపల్లి సానుకూలంగా స్పందించారు.అనంతరం విద్యార్థినిలతో కలిసి మంత్రి జూపల్లి సహపంక్తి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మేకల రమ్య కుమారి నాగరాజు, వైస్ చైర్మన్ మహిమూదా బేగం ఖాదర్ పాషా,తదితరులు మంత్రిని శాలువా కప్పి సన్మానించారు. కోడేర్, చిన్నంబావి మండలాలకు మంజూరై వచ్చిన 108 అంబులెన్స్ వాహనాలను పట్టణంలోని పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆవరణలో మంత్రి జూపల్లి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్ దాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రఘుపతి రావు, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు,బీచుపల్లి యాదవ్, మాజీ జెడ్పీటీసీ హనుమంతు నాయక్,మేకల నాగరాజు,వంగ రాజశేఖర్ గౌడ్,అధికారులు,ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Similar News