స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలి : జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్

యువ ఓటర్లను ప్రోత్సహింస్తూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 100% ఓటింగ్ సాధించడానికి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్విప్) కార్యకలాపాలను విరివిగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

Update: 2024-03-07 15:17 GMT

దిశ, నాగర్ కర్నూల్ కలెక్టరేట్ : యువ ఓటర్లను ప్రోత్సహింస్తూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 100% ఓటింగ్ సాధించడానికి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్విప్) కార్యకలాపాలను విరివిగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రాష్ట్రస్థాయి స్విప్ నోడల్ అధికారి భవాని శంకర్‌తో కలిసి స్విప్ కార్యక్రమాలపై జిల్లాస్థాయి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... ఓటర్ల నమోదుకు జనవరి 1, 2024 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ ఓటరు జాబితా రూపొందించామని, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నూతనంగా నమోదైన ఓటర్ల జాబితా వివరాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని అధికారులకు సూచించారు.


Similar News