ఇసుక రీచ్‌ల వద్ద డిష్యుం... డిష్యుం (వీడియో)
పెద్ద వాగు నుండి టిప్పర్లకు ఇసుక నింపే వ్యవహారంలో ఆధిపత్యం కొనసాగించేందుకు.. Special News
దిశ, మక్తల్: పెద్ద వాగు నుండి టిప్పర్లకు ఇసుక నింపే వ్యవహారంలో ఆధిపత్యం కొనసాగించేందుకు తమ జేసీబీలు పనిచేయాలని వర్కూర్ గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య శుక్రవారం గొడవ జరిగి కొట్టుకున్నారు. స్టేషన్ మెట్లు ఎక్కకుండా అధికార పార్టీ నాయకుని జోక్యంతో ఇసుక మాఫియా రంగంలోకి దిగి కొట్టుకున్నవారికి సర్ది చెప్పారు. సక్రమ, అక్రమ ఇసుక వ్యాపారంలో కాసులు కురిపిస్తున్నందున వాగులో రాత్రి పగలు ఇసుక నింపేందుకు తమ వాహనాలతో పని చేయించాలని ఇరు వర్గాల మధ్యన గొడవ జరిగి ఒకరిపై ఒకరి పిడిగుద్దులు గద్దుకున్నారు.
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన విషయాన్ని తెలుసుకుని అధికార పార్టీకి చెందిన నాయకుని సలహాలతో ఇసుక మాఫియా రంగంలోకి దిగింది. ఇరువర్గాలను వెనక్కు పిలిపించి ఇద్దరినీ కూర్చోబెట్టి సర్ది చెప్పారు. ఈ గొడవపై కేసులు నమోదైతే ఇసుక రవాణాపై ఉక్కు పాదం మోపిన కలెక్టర్ దృష్టికి వెళుతుందని, దీంతో అక్రమ ఇసుక వ్యాపారానికి గండి పడుతుందని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. నారాయణపేట జిల్లా మక్తల్ మాగనూరు మండలంలోని పెద్దవాగు పక్కన ఉన్న వర్కూరు గ్రామంలో ప్రభుత్వం రీచ్ ని ఏర్పాటు చేసింది. వాగులో నుండి ఇసుక రీచ్ వద్ద జేసీబీలతో ఇసుక తోడేందుకు అదే గ్రామానికి చెందిన చెందినవారి జేసీబీలు పనిచేస్తున్నాయి.
రాత్రి సమయంలో అక్రమ ఇసుక నింపేందుకు కూడా తమ జేసీబీలు పనిచేయాలన్నా విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. చివరికి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఇసుక మాఫియా రంగంలో దిగి కేసు కాకుండా చూశారు. ఇసుక రీచ్ వల్ల వర్కూరు గ్రామంలో ఇరువర్గాల మధ్యన గొడవలు జరగడం సర్వసాధారణమే అని, ఇలా గొడవలు జరిగినప్పుడు ఇసుక మాఫియాలు రంగంలోకి దిగి రెవెన్యూ, పోలీసులు, మైనింగ్ అధికారులు రాకుండా చూసుకుంటారని గ్రామస్తులు తెలిపారు. పగలు పర్మిట్ తో రాత్రి అక్రమ టిప్పర్లతో గ్రామం నడి మధ్య నుంచి తిరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.