మహబూబ్ నగర్ లో 'ర్యాపిడో ' సేవలు
మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజల రవాణా సౌకర్యార్ధం 'ర్యాపిడో' సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజల రవాణా సౌకర్యార్ధం 'ర్యాపిడో' సేవలు అందుబాటులోకి వచ్చాయి. పట్టణంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు ర్యాపిడో యాప్ ద్వారా ఆటో,బైక్ బుక్ చేసుకుంటే చాలు మన ఇంటి దగ్గరకే ఆటో కాని,బైక్ కాని వచ్చి మనల్ని పికప్ చేసుకుంటాయి. అందుకు ముందుగా మనం చేయవలసిందల్లా మన సెల్ ఫోన్ లోని 'ప్లే స్టోర్' నుండి 'ర్యాపిడో' యాప్ ను డౌలోడ్ చేసుకోవాలి. అనంతరం కొన్ని ఆప్షన్స్ ను పూరించాక అది మన సేవలకు సిద్ధమవుతుంది. మనం వెళ్ళాలనుకుంటే యాప్ ను ఓపెన్ చేస్తే వెళ్ళే లోకేషన్ అడుగుతుంది,దాన్ని పూరించాక,ప్రయాణ చార్జీని తెలుపుతుంది. మనకు సమ్మతమైతే వెంటనే ఓకే ఆప్షన్ ను నొక్కగానే అది మన దగ్గరకు ఎన్ని నిమిషాల్లో చేరుకుంటుందో తెలుపుతుంది. రాగానే మనల్ని పికప్ చేసుకుని,చేరాల్సిన గమ్య స్థానానికి చేరుస్తుంది. ఇది పట్టణ ప్రజల రవాణా సౌకర్యార్థం,నిరుద్యోగుల ఉపాధికి బాసటగా నిలుస్తుంది.bఇప్పడు ప్రజల్లోకి పూర్తిగా అవగాహన కలిగించడానికి ర్యాపిడో సంస్థ ఆటో,బైక్ రైడర్ల ద్వారా తన వంతు వాటాను తీసుకోవడంలేదని ఒక ఆటోవాలా తెలిపాడు.తమకు గిరాకీ అంతంతే ఉందని,నెమ్మదిగా ప్రజల్లో అవగాహన కలిగి తమ సేవలను విస్తృతంగా వినియోగించుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.