ప్రజా సమస్యలు చిత్త శుద్ధితో పరిష్కరిస్తాం: ఎస్పీ నరసింహ

ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పరిశీలించి పరిష్కరిస్తుందని, బాధితులకు అండగా ఉంటూ పిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు.

Update: 2023-05-15 17:16 GMT
ప్రజా సమస్యలు చిత్త శుద్ధితో పరిష్కరిస్తాం: ఎస్పీ నరసింహ
  • whatsapp icon

దిశ, మహబూబ్ నగర్: ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పరిశీలించి పరిష్కరిస్తుందని, బాధితులకు అండగా ఉంటూ పిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన 18 ప్రజా ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.

బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆయా సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఆయన మాట్లాడుతూ.. పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. పిర్యాదుదారులు సివిల్ వివాదాలను కోర్టులోనే పరిష్కరించుకోవలసిందిగా వారికి సూచించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీరాములు, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, సీసీఎస్ డీఎస్పీ లక్ష్మణ్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News