ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి సంవత్సరం పూర్తి చేసుకుని విజయవంతంగా రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతుందని హుజుర్ నగర్ ఎమ్మెల్యే అన్నారు.

Update: 2024-11-23 12:24 GMT

దిశ,హుజూర్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7 నాటికి సంవత్సరం పూర్తి చేసుకుని విజయవంతంగా  రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్ లో ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విజయోత్సవాల కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసేందుకు హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేయాలి.


Similar News