రేషన్ కోసం ప్రజలు బారులు.. ఫోటోల కోసం డీలర్ల ఫోజులు..

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వం తలపెట్టిన సన్నబియ్యం రేషన్ పంపిణీ పథకం అట్టహాసంగా ప్రారంభమైంది.

Update: 2025-04-02 06:54 GMT

దిశ, గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వం తలపెట్టిన సన్నబియ్యం రేషన్ పంపిణీ పథకం అట్టహాసంగా ప్రారంభమైంది. గద్వాల నియోజకవర్గంలోని కొన్ని రేషన్ షాపుల్లో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి నారాయణ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో కొందరు డీలర్లు వారి గ్రామాల్లోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయకుండా ప్రారంభిస్తున్న రేషన్ షాపుల దగ్గరకు వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చిన ఆయా డీలర్ల పోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయా గ్రామాలకు సంబంధించిన రేషన్ కార్డుల లబ్ధిదారులు సంబంధిత డీలర్ల పై మండి పడ్డారు. ఉదయం నుంచి రేషన్ షాపుల దగ్గర పడిగాపులు చేస్తుంటే డీలర్లు ఇలా పోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా ఇలా సోషల్ మీడియాలో లో పెట్టుకోవడం ఏంటని లబ్ధిదారులు కొందరు ‘దిశ’తో మాట్లాడుతూ మండిపడ్డారు. ఇలాంటి వారి పై సంబంధిత అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

Similar News