రాష్ట్రంలోనే పాలమూరు ఆర్టీసీ టాప్ 'టూ' : ఆర్ఎం శ్రీదేవి

పండుగ సమయాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, వారికి ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు కలగకుండా సజావుగా సాగేందుకు యాజమాన్యం ప్రకటించిన వంద రోజుల 'గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ' అనే సరికొత్త నిర్ణయాన్ని అమలు పరచి రాష్ట్రంలోనే రెండవ స్థానాన్ని సాధించామని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి.శ్రీదేవి తెలిపారు.

Update: 2024-03-06 16:50 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పండుగ సమయాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, వారికి ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు కలగకుండా సజావుగా సాగేందుకు యాజమాన్యం ప్రకటించిన వంద రోజుల 'గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ' అనే సరికొత్త నిర్ణయాన్ని అమలు పరచి రాష్ట్రంలోనే రెండవ స్థానాన్ని సాధించామని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి.శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గత సంవత్సరం అక్టోబర్ 15న యాజమాన్యం శ్రీకారం చుట్టిన వంద రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్‌ను జనవరి 22 వరకు నిర్వహించి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అత్యధిక ఆదాయం సమకూర్చడం, ఈపీకే, ఓఆర్ ఇలా అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డును సాధించామని ఆమె తెలిపారు. ఈ ఘనత జిల్లా కండక్టర్, డ్రైవర్, మెయింటెనెన్స్ కార్మిక, ఉద్యోగులందరినీ, వారి కృషి ఫలితంగానే ఈ ఘనత సాధించామని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణమండపంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారని ఆమె తెలిపారు.


Similar News