Niranjan Reddy : హత్య కేసు చేధనలో పోలీసులు విఫలం

మండల పరిధిలోని లక్ష్మీ పల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన

Update: 2024-08-13 14:15 GMT

దిశ,చిన్నంబావి : మండల పరిధిలోని లక్ష్మీ పల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన బొడ్డు శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు.అనంతరం మండల కేంద్రంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోడు శ్రీధర్ రెడ్డి హత్య జరిగి మూడు మసలైన పోలీసు అధికారులు కేసులో నిందితులను ఇప్పటి వరకు గుర్తించకపోవడం విడ్డూరమని,హత్య కేసులో వారి తల్లిదండ్రులు కొందరిని అనుమానితులుగా ఫిర్యాదు చేసిన సదురు వ్యక్తుల పేర్లు తొలగించాలని పోలీసులు కోరడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.కేసులో ఎలాంటి పురోగతి లేదని నిజాలను నిగ్గు తేల్చకపోతే త్వరలో డీజీపీ కార్యాలయం ఎదుట మండల ప్రజలతో ధర్నా చేస్తామని హెచ్చరించారు.హత్య కేసులో చేదనలో పోలీసు అధికారులు అమయకులను విచారణ పేరుతో వేధిస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు కానీ వారి కుటుంబ సభ్యులు సూచిస్తున్న వ్యక్తులను విచరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో హత్య జరిగితే ఓ మంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించాకుండా హత్యకు గురైన వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఈ హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈహత్య కేసుపై డీజీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ పై నమ్మకం ఉందని త్వరగా కేసును చేదించాలని కోరారు.నియోజకవర్గం మంత్రి తన కన్నుసల్లో ఉండే పోలీసు అధికారులకు పోస్టింగ్ ఇచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ,మాజీ జడ్పీటీసీ వెంకట్రావమ్మ,బీఆర్ఎస్ నాయకులు రంగినేని అభిలాష రావు,చిన్నారెడ్డి,శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News