100 ఏళ్లు పూర్తి చేసుకున్న తల్లికి తులాభారం

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గొర్లోనిబావి గ్రామంలో జంబుల లచ్చమ్మ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

Update: 2025-03-31 13:41 GMT
100 ఏళ్లు పూర్తి చేసుకున్న తల్లికి తులాభారం
  • whatsapp icon

దిశ,మద్దూరు/గుండుమాల్: నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం గొర్లోనిబావి గ్రామంలో జంబుల లచ్చమ్మ 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం ఆమె కుమారులు బాలకృష్ణయ్య , రాములు,వెంకటయ్య,భీమన్న,సహదేవులు కోడళ్లు ఐదుగురు ,ముగ్గురు కూతుళ్లు, మనవాళ్ళు ,మనవరాళ్లు,కలిసి వారి తల్లి లచ్చమ్మకు అరటి పండ్లతో ఘనంగా తులాభారాన్ని నిర్వహించారు.  తల్లిని భారంగా చూసే నేటి కలియుగంలో ఆమె ఆలనా పాలన చూసి 100 పూర్తి చేసుకున్న తల్లికి తులాభారం చేసిన వారి కుటుంబ సభ్యులకు గ్రామస్తులు అభినందించారు.

Similar News