వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి నియోజకవర్గం ముద్దుబిడ్డ బీఆర్ఎస్ పార్టీ ని బద్దలు కొట్టి ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హైదరాబాద్ లో వనపర్తి ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా గోపాలపేట మండల కేంద్రంలో ని పద్మావతి ఫంక్షన్ హాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
దిశ: గోపాలపేట : వనపర్తి నియోజకవర్గం ముద్దుబిడ్డ బీఆర్ఎస్ పార్టీ ని బద్దలు కొట్టి ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హైదరాబాద్ లో వనపర్తి ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా గోపాలపేట మండల కేంద్రంలో ని పద్మావతి ఫంక్షన్ హాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అఖండ విజయం తో ఎమ్మెల్యేగా గెలుపొందిన మేఘా రెడ్డి గోపాలపేట మండల కేంద్రానికి రావడంతో పలు గ్రామాల నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మేఘా రెడ్డి కి స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా నాయకులు శాలువాలు కప్పి ఎమ్మెల్యే లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి నేడు శుక్రవారం కాంగ్రెస్ అధినేత సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుందని కాబట్టి అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు ప్రతి ఒక్కరూ హాజరై సోనియమ్మ జయంతిని ఘనంగా జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ సత్య శివారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ శివన్న మరియు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.