మూడు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని సీఎం కు ఎమ్మెల్యే వినతి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మరియు రాష్ట్ర మంత్రులను నారాయణపేట ఎమ్మెల్యే డా .పర్ణిక రెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కుంభం శివ కుమార్ రెడ్డి తో కలిసి రాష్ట్ర సచివాలయంలో సోమవారం కలిశారు
దిశ, నారాయణపేట ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మరియు రాష్ట్ర మంత్రులను నారాయణపేట ఎమ్మెల్యే డా .పర్ణిక రెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కుంభం శివ కుమార్ రెడ్డి తో కలిసి రాష్ట్ర సచివాలయంలో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన సౌలభ్యం మేరకు నియోజకవర్గం లో కొత్తగా గార్లపాడు, కోటకొండ, కానుకుర్తి మండలాలను ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో 69 జీవోపై పూర్తిస్థాయి వివరాలు వెల్లడించిన నేపథ్యంలో సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకానికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరారు. నారాయణపేట నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి సహకరించాలన్నారు. సీఎంను కలిసిన వారిలో చిట్టెం లక్ష్మి ఐఏఎస్ కూడా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే పర్ణిక మంత్రులు జూపల్లి కృష్ణారావు, పోన్నం ప్రభాకర్ లను కలిశారు.