వరుస దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పీఎస్ పరిధిలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Update: 2023-04-25 17:54 GMT
వరుస దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..
  • whatsapp icon

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పీఎస్ పరిధిలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బల్మూరు మండల పరిధి పోలిశెట్టి పల్లికి చెందిన వసుకుల కృష్ణ పట్టణంలో నాలుగు దొంగతనాల కేసులలో నిందితుడిగా ఉన్నాడు.

అచ్చంపేట పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని చేసి విచారించి 148 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న అచ్చంపేట పోలీసులు ఎస్ఐ గోవర్ధన్, సిబ్బంది రాందాస్, గోపాల్, మల్లేష్, భీములు, శ్రీను, కనకైయ్య, రామాంజనేయులులను జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐ అభినందించారు. 

Tags:    

Similar News