Maganuru: తెల్లవారుజామునే అడిషనల్ కలెక్టర్ తనిఖీలు.. ఎంఐఎస్ కు మెమో జారీ
మాగనూర్ భోజనం వికటించిన సంఘటనతో అధికారులు జిల్లాలో తనిఖీలు మొదలుపెట్టారు.
దిశ మాగనూర్ : మాగనూర్ భోజనం వికటించిన సంఘటనతో అధికారులు జిల్లాలో తనిఖీలు మొదలుపెట్టారు. శనివారం మాగనూరు కేజీబీవీ, ఎస్సీ హాస్టల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం తనిఖీ చేశారు. విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. మరుగుదొడ్లు ద్వారా విపరీతమైన వాసన వస్తుందని మిషన్ భగీరథ నీరు సరైన సమయంలో రావడంలేదని మినరల్ వాటర్ కల్పించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులకు రావాల్సిన పుస్తకాలు కొన్ని మాత్రమే పంపిణీ చేసి మిగతావి అధికారులు బయట అమ్ముకుంటున్నారని కలెక్టర్ దృష్టికి పలువులు తీసుకెళ్లారు.
క్లాసులు జరుగుతున్న సమయంలో చీటికిమాటికి టీచర్లతో మీటింగ్ పెడుతున్నారని కలెక్టర్ కు విన్నవించారు. మధ్యాహ్న భోజనం బిల్లులు చేయడంలో నిర్లక్ష్యం వహించిన మాగనూరు ఎంఐఎస్ స్వప్నకు మేమో జారీ చేయవలసిందిగా అధికారులకు ఆదేశించారు. కస్తూర్బా పాఠశాలలో సమయం పాటించడం లేదని అదనపు కలెక్టర్ ఎస్ ఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు ఉంటాయని సూచించారు. తాసిల్దార్ సురేష్, ఎంపీడీవో రహీమౌతుదిన్, ఆర్ ఐ శ్రీశైలం తదితరులు ఉన్నారు.