రోడ్ల విస్తరణ బాధితులకు ఇందిరమ్మ ఇల్లు
ప్రజా రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
దిశ,వీపనగండ్ల: ప్రజా రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పానుగల్ మండల పరిధిలోని కేతేపల్లి గ్రామంలో కోటి 99 లక్షల రూపాయలతో 600 మీటర్ల మేరకు రోడ్డు విస్తరణ పనులకు, గ్రామంలో ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రోడ్ల విస్తరణ బాధితులతో మాట్లాడారు. రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని విస్తరణ బాధితులకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామని ఆయన అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజా పాలన కొనసాగుతుందన్నారు.
మంత్రి జూపల్లి కి సిపిఐ నాయకుల వినతి
కేతేపల్లి గ్రామంలో స్మశాన వాటిక అభివృద్ధికి 20 లక్షల రూపాయలు మంజూరు చెయ్యాలని,గ్రామంలోని బీరప్ప వద్ద గల 324 బీసీ ప్లాట్లలో ఇండ్లు నిర్మించుకునేందుకు నీటి వసతి, కరెంటు వసతి కల్పించాలని,గ్రామంలో 50 ఫీట్ల రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ తో పాటు నష్టపరిహారం ఇవ్వాలని,ఎక్కువగా నష్టపోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ తోపాటు ప్రభుత్వ స్కీముల్లో ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఐ నాయకులు కళావతమ్మ, శ్రీరాములు మంత్రి జూపల్లి కృష్ణారావుకు విన్నవించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ చైర్మన్ మామిల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,ఆర్ అండ్ బి డిఈ సీతారామస్వామి,ఎంపిడిఓ గోవింధ రావు,ఏఐసీసీ ఓబీసీ జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ కేతూరి వెంకటేష్,డాక్టర్ పగిడాల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జెడ్పిటిసి రవికుమార్, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,కాంట్రాక్టర్ తిరుపతయ్య సాగర్, ఏయి రాకేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.