పరిజ్ఞానంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని సాధించవచ్చు
విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.
దిశ, నారాయణ పేట ప్రతినిధి: విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్ గదిలో భారత ప్రభుత్వం యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియల్ వ్యవస్థల గురించి తెలిపారు. ఎమ్మెల్యే ఎంపీలు ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడతారని, వాళ్ళు అసెంబ్లీ, పార్లమెంట్‌లో చర్చించి తీసుకున్న నిర్ణయాలను పీఎం, సీఎం, సంబంధిత అధికారులు అమలు చేస్తారని తెలిపారు. ఆయా నిర్ణయాలు నిబంధన ప్రకారం కొనసాగుతున్నాయా? లేదా ? అని జుడిషియల్ వ్యవస్థ పరిశీలిస్తుందన్నారు. విద్యార్థులు ఏదైనా అంశంపై డిబేట్ చేయాలనుకుంటే ముందుగా ఆ అంశంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ఆ డిబేట్ చక్కగా కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రిన్సిపాల్ రంగారెడ్డి, డివైఎస్‌ఓ వెంకటేష్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.