మేకల మందపై హైనా దాడి.. బాధితుడికి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో నిన్నా రాత్రి హైనా మేకల మందపై దాడి చేయగా వాటిలో (9) మేకలు అక్కడిక్కడే మరణించాయి.
దిశ, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో నిన్నా రాత్రి హైనా మేకల మందపై దాడి చేయగా వాటిలో (9) మేకలు అక్కడిక్కడే మరణించాయి. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంఘటన వివరాలను ఫారెస్ట్ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ సహాయం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని తెలిపారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ. 75 వేల నష్టం వాటిల్లడంతో మేకల యాజమానికి అశోక్ కు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన వ్యక్తిగతంగా తక్షణ సహాయంగా రూ.25000/- లను ప్రకటించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ వైస్ చైర్మన్ కొడంగల్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కౌన్సిలర్లు సతీష్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.