ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ వర్షాలు.. దెబ్బతిన్న పంటలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నష్టాలలో ముంచేస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలోని పలు మండలాలలో మంగళవారం
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నష్టాలలో ముంచేస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలోని పలు మండలాలలో మంగళవారం సాయంత్రం నుండి బుధవారం తెల్లవారుజామున వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయి. పొలాలు, కల్లాలు, రోడ్లపై ఉన్న వరి ధాన్యం, మిరప పంట తడిసి ముద్దయింది. పలుచోట్ల రైతులు ధాన్యం తడవకుండా రాత్రి పగలు అనకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు.
పెద్ద మొత్తంలో మామిడికాయలు రాలిపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నీలహళ్లి గ్రామంలో నర్సింలు అని రైతుకు సంబంధించిన రెండు గోవులు పిడుగుపాటుకు గురై మరణించాయి. గ్రామంలోని కుమ్మరి మహదేవుడు అనే రైతుకు సంబంధించిన గేదె మరణించింది. దామరగిద్ద మండలం కాటన్ పల్లి గ్రామానికి చెందిన లాలప అనే రైతుకు సంబంధించిన కాడెద్దు మృతి చెందింది. జడ్చర్ల ఆలో ని పల్లి గ్రామంలో సత్యనారాయణ రెడ్డి అనే రైతు సంబంధించిన గేదెలు మృతి చెందాయి. మంగళవారం సాయంత్రం కృష్ణ మండలం లో పాటు వల్ల గాయపడిన ఏడుగురు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంటలు, పశువులను నష్టపోయిన తమను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.