క‌లెక్టర్ వాట్సప్ పేరుతో ఫేక్ మెసేజ్‌లు.. అధికారులు అప్రమత్తం

కందనూల్ జిల్లా క‌లెక్టర్ వాట్సప్ డీపీ పేరుతో జిల్లాలోని ఆయా శాఖల అధికారులు ఆకతాయిలు మరోసారి ఫేక్ మెసేజ్‌లు చేశారు.

Update: 2022-12-13 08:21 GMT

దిశ, నాగర్ కర్నూల్: కందనూల్ జిల్లా క‌లెక్టర్ వాట్సప్ డీపీ పేరుతో ఆకతాయిలు, జిల్లాలోని ఆయా శాఖల అధికారులకు మరోసారి ఫేక్ మెసేజ్‌లు చేశారు. ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ మెసేజ్లు పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ పీ ఉదయ్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఇలాంటి పరిణామాలు పలుమార్లు చోటు చేసుకోగా.. అది మళ్ళీ రిపీట్ కావడం వెనుక అధికారుల అలసత్వం లేకపోలేదని శాఖల అధికారులు విచారణ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నెంబర్ +916026712814 పేరుతో కలెక్టర్ డీపీ వాడుకుని చేసే ప్రకటనలు, ఆదేశాలను ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు. ఇలా ఎవరికైనా మెసేజ్‌లు వచ్చినట్లయితే, తమ ఉన్నతాధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News