నీతి నిజాయితీ గల వ్యక్తులను ఎన్నుకోవాలి - జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్

ఓటు హక్కు వినియోగించే వారు నీతి నిజాయితీ గల వ్యక్తులను ఎన్నుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ చీర్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం ఎం ఎ ఎల్ డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలలో ఓటు హక్కు పై అవగాహన కల్పించనున్నారు.

Update: 2023-09-21 16:07 GMT
నీతి నిజాయితీ గల వ్యక్తులను ఎన్నుకోవాలి - జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్
  • whatsapp icon

దిశ, గద్వాల్ టౌన్ : ఓటు హక్కు వినియోగించే వారు నీతి నిజాయితీ గల వ్యక్తులను ఎన్నుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ చీర్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం ఎం ఎ ఎల్ డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలలో ఓటు హక్కు పై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో పవిత్రమైనదని ప్రతి ఒక్కరూ ఓటు ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమకు నచ్చిన నీతివంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలని అన్నారు. ప్రజలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ వీధి నాటకాలు, పాటలు, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ద్వారా మంచి వ్యక్తిని ఎన్నుకుంటే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వాళ్లు స్థాయి నుండి ఎంత స్థాయి వరకు ఓటర్లు తమ ఓటు హక్కును సరైన పద్ధతిలో వినియోగించుకుని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వినియోగించుకోవాలని అన్నారు. గ్రామ గ్రామాన విద్యార్థులు ఓటు హక్కు సద్వినియోగం పై అవగాహన కల్పించాలన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో కూడా ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్నారు.

గతంలో ఎన్నికల కమిషన్ టిఎన్ సేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల విధానంలో చాలా మార్పు వచ్చిందని ఇప్పుడు కూడా ఇంకా మార్పురావాలన్నారు. ఈ సందర్భంగా గద్వాల, ధరూర్, మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, గట్టు, బీచ్ పల్లి, వడ్డేపల్లి, అలంపూర్, మానవపాడు, గద్వాల, కేటి దొడ్డి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన ద్వారా ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు, నోడల్ అధికారి హృదయ రాజు, ఇన్చార్జి కళాశాల ప్రిన్సిపాల్, న్యాయనిర్ణేతలుగా బీసీ వెల్ఫేర్ అధికారి శ్వేతా ప్రియదర్శిని, ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News