దిశ ఎఫెక్ట్.. అడిషనల్ కలెక్టర్ కు డీడబ్ల్యుఓ బాధ్యతలు
గ్రీవెన్స్ కు పరిష్కారం ఏది.. జిల్లా అధికారుల్లో కొరవడిన జవాబుదారీతనం అనే శీర్షిక దిశలో ప్రచురితమైన విషయం తెలిసినదే.

దిశ, నారాయణపేట క్రైమ్ : గ్రీవెన్స్ కు పరిష్కారం ఏది.. జిల్లా అధికారుల్లో కొరవడిన జవాబుదారీతనం అనే శీర్షిక దిశలో ప్రచురితమైన విషయం తెలిసినదే. ఇందులో భాగంగానే చిన్నపిల్లల శాఖకు చెందిన అధికారిని లక్షల్లో బిల్లుల పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయని ప్రచురితమైంది. దీంతో ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ స్పందించి ఇది వరకు డీడబ్ల్యుఓగా కొనసాగిన జయబాయిని డీడబ్ల్యూఓ పోస్ట్ నుంచి తప్పిస్తూ సీడీపీఓ బాధ్యతలను అప్పగించారు. నారాయణపేట జిల్లాకు ఈ మధ్యనే అడిషనల్ కలెక్టర్ గా వచ్చిన సంచిత్ గంగ్వార్ కు నారాయణపేట జిల్లా డీడబ్ల్యుఓ ఇన్చార్జి బాధ్యతలను ఇచ్చారు.