అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
అకాల వర్షాలు,వడగండ్ల వానకు జరిగిన పంట నష్టానికి అధైర్య పడవద్దని మీకు అండగా ఉండి ఆదుకుంటామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు. శ

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: అకాల వర్షాలు,వడగండ్ల వానకు జరిగిన పంట నష్టానికి అధైర్య పడవద్దని మీకు అండగా ఉండి ఆదుకుంటామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు. శనివారం రాత్రి కురిసిన వడగండ్లవానకు పంటలు దెబ్బతిన్నాయని తెలిసిన వెంటనే రాత్రికిరాత్రే అధికారులను అప్రమత్తం చేసి,ఆదివారం ఆయన మహబూబ్ నగర్ మండలంలోని చౌదర్ పల్లి,జనుంపల్లి,బొక్కలోనిపల్లి,జమిస్తాపూర్,రామచంద్రాపూర్ గ్రామాలలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అంచనా వేశారు. మొత్తం 1520 ఎకరాల్లో పంటనష్టం జరిగిందని,ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో రైతులు నష్టపోవడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి పంటనష్టం ఇప్పిస్తానని రైతులకు హామీ ఇచ్చి,ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంబడి గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి,సుధాకర్ రెడ్డి,గోవింద్ యాదవ్,నాగిరెడ్డి,ధర్మాపూర్ నర్సింహారెడ్డి,వెంకటేష్ యాదవ్,రైతులు రామచంద్రయ్య,యాదయ్య,సిద్ధయ్య,శ్రీనివాసులు,నయాబ్ తహిసిల్దార్ శ్యాం సుందర్ రెడ్డి,ఏఓ శృతి,తదితరులు ఉన్నారు.