CI : డీజే, బాణాసంచా నిషిద్ధం

గణేష్ శోభాయాత్రలో డిజే,బాణసంచ లకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ రావు హెచ్చరించారు. శ

Update: 2024-09-14 14:51 GMT

దిశ,వనపర్తి : గణేష్ శోభాయాత్రలో డిజే,బాణసంచ లకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ రావు హెచ్చరించారు. శనివారం సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ నాగభూషణం రావు, టౌన్ ఎస్సై జయన్నతో కలిసి మాట్లాడుతూ… వనపర్తి పోలీస్ సర్కిల్ పరిధిలో 15,16,17 తేదీల్లో నిర్వహించబోయే వినాయక నిమజ్జనంలో గణేష్ ఉత్సవ సమితి,మంటప నిర్వాహకులు, ప్రజలు పోలీసు శాఖ జారీ చేసిన నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని వనపర్తి సీఐ నాగభూషణ రావు సూచించారు. గణేష్ శోభ యాత్రను భక్తి శ్రద్దలతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలన్నారు. నిమజ్జనం సమయం ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.163 బీఎన్ఎస్ చట్టం ను పటిష్టంగా అమలు చేస్తామని,నిమజ్జనంలో ప్రజలు సంయమనం పాటించి పోలీసు శాఖ కు సహకరించాలని కోరారు.


Similar News