సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సజావుగా జరగాలి

జిల్లా కేంద్రంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సజావుగా జరగాలని, అందుకు తగ్గట్లుగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని జోగులాంబ జోన్ 7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.

Update: 2024-03-06 11:40 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సజావుగా జరగాలని, అందుకు తగ్గట్లుగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని జోగులాంబ జోన్ 7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక ఏఎస్ఎన్ గార్డెన్స్‌లో ఎస్పీ హర్షవర్థన్‌తో కలిసి ఆయన పోలీస్ అధికారులు, బందోబస్తు సిబ్బందితో బహిరంగ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పట్టణంలోని ఎంవీఎస్ కాలేజీ ఆవరణలో సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, విధుల్లోని అధికారులు, సిబ్బంది సంయమనం పాటిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ డైవర్షన్‌లతో తగు జాగ్రత్తలను తీసుకుంటూ అప్రమత్తంగా ఉండి పక్కాగా విధులు నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌‌తో కలిసి ఆయన సభాస్థలి, గ్యాలరీ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రొబేషనరీ ఎస్పీ చిత్తరంజన్, అదనపు ఎస్పీలు రాములు, సురేష్ కుమార్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.


Similar News