బాల్య వివాహాలు సామాజిక దురాచారం

బాల్య వివాహాలు సామాజిక దురాచారమని,దాని నిర్మూలనకు అందరూ కట్టుబడి ఉండాలని ఉమ్మడి జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ అన్నారు.

Update: 2024-11-29 12:55 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బాల్య వివాహాలు సామాజిక దురాచారమని,దాని నిర్మూలనకు అందరూ కట్టుబడి ఉండాలని ఉమ్మడి జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ అన్నారు. స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ,యాక్సెస్ టు జస్టిస్ ప్రాజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో.. నిర్వహించిన 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' ప్రచార కార్యక్రమంలో ఆమె బాలికలనుద్ధేశించి ప్రసంగించారు. బాల్య వివాహాలు వలన బాలల విద్య,ఆరోగ్యం,రక్షణ,అభివృద్ధి భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలు,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై తమ సోసైటీ ప్రతి గ్రామం,మండలంలో అవగాహన కల్పిస్తున్నామని,బాలలకు చట్టంలో సమానత్వం ఉందని,సామాజికంగా,ఆర్ధికంగా,రాజకీయంగా చైతన్యం రావాలనే కేంద్ర ప్రభుత్వం 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' కార్యక్రమం చేపట్టిందని,2030 కల్లా బాల్య వివాహా రహిత భారతదేశ నిర్మాణం లక్ష్యంగా ముందుకు వెళుతుందని  ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రవికుమార్ యాదవ్,రవీందర్ నాయక్,సుబ్రమణ్యం,మల్లారెడ్డి,జిల్లా కోఆర్డినేటర్ విశ్వకాంత్,కన్నన్ రాజ్,శ్రీలక్ష్మి,చెన్నమ్మ,జయభారతి తదితరులు పాల్గొన్నారు.


Similar News