పశువుల డేటా సేకరించాలి
దేశ వ్యాప్తంగా జరుగుతున్న పశు గణన సర్వే తో ప్రతి పశువు డేటాను సేకరించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: దేశ వ్యాప్తంగా జరుగుతున్న పశు గణన సర్వే తో ప్రతి పశువు డేటాను సేకరించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పశు గణన సర్వేకు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పశువు డేటాను క్షేత్ర స్థాయిలో సేకరించాలని,భవిష్యత్తులో పశువులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జంతువుల సంరక్షణ గురించి వాటి యజమానులకు తగు సూచనలు,సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు. అలాగే పశువుల యజమానులు కూడా పశువుల గణనకు వచ్చే అధికారులకు పూర్తి సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ అధికారి డా.మధుసూదన్ గౌడ్,డాక్టర్లు వెంకటేశ్వర్లు,రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది...
గతం పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శనివారం పట్టణంలోని బీఈడీ కళాశాలను పరిశీలించారు. పదేళ్లు పాలనలో బీఈడి,డైట్ కళాశాలల వంక కూడ చూడలేదని,ఇక్కడ కనీస వసతులు కూడా లేవని ఆయన పరోక్షంగా మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ను విమర్శించారు. ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన డైట్ కళాశాల శిధిలావస్థకు చేరుకుందని,ఈ నెల 30న నూతన భవనానికి శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట డైట్ కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజు,గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి,కౌన్సిలర్ తిరుమల వెంకటేష్ తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు.