బోయపల్లి రైల్వే గేట్ బంద్..ఎప్పటివరకంటే..?

పట్టణంలో నిత్యం రద్దీ ప్రాంతమైన బోయపల్లి రైల్వే గేట్ ను గురువారం నుంచి మూడు రోజుల పాటు మూసి వేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు

Update: 2024-12-31 14:22 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పట్టణంలో నిత్యం రద్దీ ప్రాంతమైన బోయపల్లి రైల్వే గేట్ ను గురువారం నుంచి మూడు రోజుల పాటు మూసి వేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం,పట్టణం నుంచి కొత్త గంజ్,కొత్త చెరువు,బోయపల్లికి వెళ్ళే ప్రజలు,వాహనదారులు,వ్యాపారస్తులు రైల్వే గేట్ గుండా జరిగే రాకపోకలను కలెక్టర్ బంగ్లా ప్రక్కన గల రైల్వే ఫ్లైఓవర్ మీదుగా ట్రాఫిక్ ను మళ్ళిస్తున్నట్లు తెలిపారు. ఈ అసౌకర్యానికి ప్రజలు,వాహనదారులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


Similar News