మహారాష్ట్రలో బీజేపీది ల్యాండ్ స్లైడ్ విక్టరీ
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీదే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ వ్యాఖ్యానించారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీదే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని పురస్కరించుకుని,పట్టణంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయాలని చూసిందని,రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే సెంటిమెంట్ రాజకీయం చేసినా వారి ఆటలు సాగలేదని ఆమె విమర్శించారు. స్వతాహాగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి,తెలంగాణ మోడల్ అంటూ చేసిన ప్రచారం బోగస్ అని అక్కడి ప్రజలకు తెలిసిపోయిందని,ఆయన అబద్ధాల ప్రచారం చేసినా వారు నమ్మలేదని ఆమె ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ,షిండే,ఫడ్నవిస్ లపై ప్రజలు నమ్మకం ఉంచి భారీ విజయాన్ని కట్టబెట్టారని,ఈ సందర్భంగా ప్రధాని మోడీకి,అమిత్ షా తదితర పార్టీ పెద్దలకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి, రమేష్, రాములు,యాదయ్య,నారాయణ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.