భూ భకాసురుల కోసమే ధరణి పోర్టల్..
ధరణి పోర్టల్ వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి విమర్శించారు.
దిశ ప్రతినిధి, గద్వాల్: ధరణి పోర్టల్ వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. సోమవారం ధరూర్ మండలం లో జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భూ భకాసురుల కోసమే ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టి రైతులు తమ భూములు తమ పేరు మీద కాకుండా ఇతరుల పేర్ల మీద పాస్ బుక్‌లు రావడం వల్ల చాలామంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
ధరణి పోర్టల్‌లోని లోపాలను ప్రభుత్వం సరిదిద్ది పేద రైతులకు ఆదుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో తుమ్మిల ఎత్తిపోతల పథకాన్ని కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని మాయమాటలు చెప్పి 9 సంవత్సరాలు కావస్తున్న ఎక్కడ పనులు అక్కడే అసంపూర్తిగా ఉన్నాయని విమర్శించారు. అలంపూర్ జోగులాంబ లోని ప్రసాద్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం రూ. 63 కోట్లు మంజూరు చేసిందని.. ఇప్పటికీ పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపింది.
24 గంటల కరెంటు ఇస్తానని చెప్పి రెండేళ్లుగా వ్యవసాయానికి 8 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్తుని అందించలేక పోయాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఏ రోడ్డు చూసినా గుంతల మయం.. ఆపద సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా ఇన్చార్జి వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు డాక్టర్ డీకే స్నిగ్ధ రెడ్డి, రవికుమార్, జలగరి అశోక్ గద్వాల అసెంబ్లీ ఇన్చార్జి కృష్ణ, అసెంబ్లీ కన్వీనర్లు రామాంజనేయులు, తిరుమల్ రెడ్డి పార్లమెంట్ కో కన్వీనర్ సంజీవ్ భరద్వాజ్,, జిల్లా మాజీ అధ్యక్షులు ఏమ్ ఎస్ రెడ్డి, నాగర్ కర్నూల్ బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు.