బీజేపీ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదం: ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి
అన్ని ఆధారాలతో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేస్తే బీజేపీ నాయకులు రాష్ట్రమంతా ధర్నాలు చేయడం హాస్యాస్పదమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బీజేపీ తీరును తప్పు బట్టారు.
దిశ, నారాయణపేట ప్రతినిధి: అన్ని ఆధారాలతో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేస్తే బీజేపీ నాయకులు రాష్ట్రమంతా ధర్నాలు చేయడం హాస్యాస్పదమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బీజేపీ తీరును తప్పుబట్టారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ అనేది జరగలేదని తల్లిదండ్రులకు తమ పార్టీ భరోసానిస్తుందన్నారు. రాష్ట్రాన్ని అస్థిరపరచాలన్నదే బీజేపీ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఇలాంటి చర్యలకు పాల్పడితే గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీజేపీ పార్టీ నాయకులను రోడ్లపై తిరగనీయకుండా అడ్డుకుంటారని హెచ్చరించారు.
ముందే మాట్లాడుకుని పదో తరగతి సెంటర్ వద్ద ఫోటోలు తీసుకుని రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆరు నెలలుగా ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీపై లేనిపోని ఆరోపణలను చేస్తుందన్నారు. పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి నిందితుడు బీజేపీ అనుబంధం ఉపాధ్యాయ సంస్థలో ఉన్నాడని, అలాగే మరో పేపర్ లీకేజీ నిందితుడు ప్రశాంత్ బండి సంజయ్ కు అనుచరుడు అని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందే అనసూయ, వైస్ చైర్మన్ హరి నారాయణ బట్టడ్, ఎంపీపీ అమ్మ కోళ్ల శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ అంజలి, మండల పార్టీ అధ్యక్షులు వేపూరి రాములు, విజయ సాగర్ తదితరులు పాల్గొన్నారు.