బస్ ల కోసం బీజేపీ రాస్తా రోకో..

ఆర్టీసీ బస్ ల కోసం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు శనివారం రాస్తా రోకో చేపట్టారు.

Update: 2024-11-30 11:06 GMT

దిశ, కొల్లాపూర్ : ఆర్టీసీ బస్ ల కోసం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు శనివారం రాస్తా రోకో చేపట్టారు. శనివారం భూత్పూర్ లో రైతు పండుగకు సీఎం రేవంత్ రెడ్డి సభకు జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను వాడుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురికావడంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తమటం సాయి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం తగినన్ని ఆర్టీసీ బస్ లను సమకూర్చిన తర్వాత సీఎం సభకు ఆర్టీసీ బస్ లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ప్రభుత్వానికి తగదని ఆయన పేర్కొన్నారు.

ఎలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృత్తం కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కేతురి నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు సందు రమేష్, మండల అధ్యక్షుడు తమటం సాయి కృష్ణ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ యాదవ్, ఆకునమోని రమేష్ యాదవ్, సోమ భాస్కర్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయినపల్లి చంద్ర శేఖర్ రావు, ఇరగదిండ్ల పరమేష్, పలడుగుల కురుమయ్య, బీజెఎంవైఎం టౌన్ అధ్యక్షుడు మెంటే శివ కృష్ణ యాదవ్, మండల అధ్యక్షుడు అకునమొని భరత్ యాదవ్, కాశిపురం మహేష్, పల్లె మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News