సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి..

పెద్దకొత్తపల్లిలో మహిళా సంఘం సభ్యులకు సైబర్ నేరాలు, పిల్లలపై వాటి ప్రభావం అనే అంశంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.

Update: 2025-03-27 13:01 GMT
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి..
  • whatsapp icon

దిశ, పెద్దకొత్తపల్లి: పెద్దకొత్తపల్లిలో మహిళా సంఘం సభ్యులకు సైబర్ నేరాలు, పిల్లలపై వాటి ప్రభావం అనే అంశంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు.  శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.  ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లా సైబర్ క్రైమ్ డి.ఎస్.పి గిరి కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయిందని, అలాగే పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రధాని గత రెండు నెలల నుంచి సైబర్ క్రైమ్ గురించి మొబైల్ ఫోన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 2019 నుంచి పోల్చుకుంటే ప్రస్తుతం క్రైమ్ రేటు 60కి శాతం పైగా పెరిగిందని జిల్లా సైబర్ క్రైమ్ డిఎస్పి గిరి కుమార్ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ అప్రమత్తతో ఉండాలని, కొత్త వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా వారికి వ్యక్తిగత విషయాలు చెప్పరాదని తెలిపారు. అలాగే పిల్లలకు రాత్రిపూట ఎక్కువ సమయం పెద్ద ఫోన్లు ఇవ్వరాదని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ, హెల్ప్ లైన్ 100 వినియోగించుకోవాలని, ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే గోల్డెన్ అవర్ లోనే 1930కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రామిక వికాస కేంద్రం డైరెక్టర్ లక్ష్మణరావు, డీసీపీయూ మల్లేష్, సఖి అడ్మిన్ సునీత, ఏపీఎం అరుణ, సీ డబ్ల్యూసి మెంబర్ విష్ణు, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు అరుణ, ప్రాజెక్టు కోఆర్డినేటర్ తిరుపాల్ పాల్గొన్నారు.

Similar News