అయిజ ప్రైవేటు ఆస్పత్రులపై కలెక్టర్ సీరియస్
అయిజలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నిర్వాహకులపై జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది.
దిశ, అయిజ : అయిజలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నిర్వాహకులపై జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది. బుధవారం దిశ దిన పత్రికలో ప్రచురితమైన " అయిజ లో సిండికేట్ వైద్యం " అన్న వార్తకు ఆయన స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గురువారం సాయంత్రం జిల్లా వైద్యాధికారి శశికళ అయిజ లో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నిర్వాహకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాత్రి సమయంలో వైద్యం కోసం వచ్చే ఏ ఒక్కరికి వైద్యం నిరాకరించినందుకు వీలు లేదని తేల్చి చెప్పారు. వైద్యం నిరాకరించినట్లు తేలితే సంబంధిత ఆస్పత్రి అనుమతులు రద్దు చేస్తామని ఆమె తెలిపారు. ప్రజలు కూడా నేరుగా ఇటువంటి విషయాల పై తమకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. జిల్లా వైద్యాధికారి అయిజ కు వచ్చి ఆస్పత్రి నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం ముందుగా మీడియాకు సమాచారం ఇవ్వక పోవడం పై పాత్రికేయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.