పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు

తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ బోర్డు హైదరాబాద్ వారి ఉత్తర్వులు ప్రకారం డిఎంఎల్ టి ,డిఇసిజి పారామెడికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 27న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-11-23 14:56 GMT

దిశ, గద్వాల టౌన్ : తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ బోర్డు హైదరాబాద్ వారి ఉత్తర్వులు ప్రకారం డిఎంఎల్ టి ,డిఇసిజి పారామెడికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 27న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల దౌదర్ పల్లిలో కౌన్సిలింగ్ కు అభ్యర్థులు 6 వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు..రెండు జతల జిరాక్స్ లను తీసుకురావాలన్నారు. ఇంటర్ టి.సి తోపాటు కులం, ఆధార్ కార్డ్ తీసుకురావాలన్నారు. కోర్సులలో అడ్మిషన్ పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు రూ.12,000 ప్రిన్సిపాల్ కాలేజ్ ఆఫ్ అలైడ్ సైన్సెస్ జోగులాంబ గద్వాల్ అనే పేరు మీద డి.డి తీయాలన్నారు.


Similar News