గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
జిల్లా కేంద్రంలోని ఐజ రోడ్డులో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని మహిళ(45) మృతి చెందినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు.
దిశ, గద్వాల క్రైం : జిల్లా కేంద్రంలోని ఐజ రోడ్డులో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని మహిళ(45) మృతి చెందినట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు. మహిళ మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచడం జరిగిందన్నారు. మహిళకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే పట్టణ ఎస్ఐ ని సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.