బాధ్యతలు స్వీకరించిన వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ

మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ శనివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-09-14 16:00 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ శనివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.నూతన చైర్మన్ గా బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా పెద్ద విజయ్ కుమార్ లు, డైరెక్టర్లు లు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా చైర్మన్ అనిత మాట్లాడుతూ… అన్నదాతల సాగుకు అవసరమైన వసతులను కల్పించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వారికి మిఠాయి తినిపించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్,చంద్రకుమార్ గౌడ్, సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్, సురేందర్ రెడ్డి, సిజె బెనహర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News